తక్షణమే బకాయిలు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలి

తక్షణమే బకాయిలు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలి

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు నియోజకవర్గంలో గత వైస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో ఇస్టానుసారంగా విద్యుత్ రేట్లు పెంచుకుంటూ పొయ్యారని తక్షణమే బకాయిలు రద్దు చేయాలని బిజెపి మహిళా నాయకురాలు మెరుగు అరుణ కుమారి కోరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గత వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రేట్లు ఇష్టానూసారంగా పెంచారని దీనివల్ల నిరుపేద యస్సి,ఎస్టీ , చేనేత వారు బకాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే బకాయిలు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్ పర్సన్ శ్రీ వి శ్రీనివాస ఆంజనేయమూర్తి రిటైర్డ్ జడ్జి గారికి వినతిపత్రం ఇచ్చారు. చైర్ పర్సన్ సానుకూలంగా స్పందించి సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!