
జర్నలిజంపై పెరుగుతున్న దాడులను ఆపండి
మహాన్యూస్ కార్యాలయం పై దాడి హేయమైన చర్య
నిందితులను కఠినంగా శిక్షించాలి
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)
కల్లూరు, న్యూస్ వెలుగు; వాస్తవాలను ప్రసారం ప్రచురణ చేస్తున్న జర్నలిజంపై ప్రస్తుతం దాడులు, హత్యలు,అక్రమకేసులు వంటి వాటితో భయబ్రాంతులకు గురిచేయడం సరైంది కాదని,ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, మహాన్యూస్ కార్యాలయంపై బిఆర్ ఎస్ పార్టీ గుండాలు చేసిన దాడిని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తీవ్రంగా ఖండిస్తున్నట్లు, దాడికి పాల్పడిన గుండాలను తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక సభ్యులు వి.విజయ్ కుమార్ పేర్కొన్నారు.ఈ మేరకు ఆదివారం మహాన్యూస్ పై దాడికి వ్యతిరేకంగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రింట్ / ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్ కుమార్,మెట్రో మధు,చంద్రమోహన్, విద్యాసాగర్ ల ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,వ్యవస్థాపక నాయకులు వి.విజయ్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలకు,ప్రభుత్వాలకు మధ్య వారధిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్ట్ లు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజలను నిష్పక్షపాతంగా పాలిస్తున్నాయా లేక అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాయా అనే అంశాలపై జర్నలిజం సుదీర్ఘ విచారణ జరుపుతోందని చెప్పారు.విచారణలో భాగంగా వాస్తవాలను ప్రజలకు తెలియచేసి వారిని చైతన్యం చేసే బాధ్యతగా పని చేస్తుందన్నారు.ఇది సహించలేని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా, లేకున్నా సహించలేక మీడియా సంస్థలు, జర్నలిస్ట్ లపై దాడులు చేయడం పరిపాటిగా మారిందన్నారు. అదేవిదంగా అధికారం అడ్డు పెట్టుకుని బిఆర్ ఎస్ పార్టీ చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పట్ల మహా న్యూస్ ప్రసారంను జీర్ణించుకోలేక బిఆర్ ఎస్ పార్టీ తన అనుచరులు, గుండాలతో మహా న్యూస్ కార్యాలయంపై రాడ్లు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఆనాటి వాస్తవాలను ప్రసారం చేస్తే ప్రజాస్వామ్య బద్దంగా అడ్డుకోవాలి కాని ఇలాంటి దాడులకు పాల్పడం, వీధి రౌడీల్లా వ్యవహరించడం దుర్మార్గం అని ఖండించారు.ఇది ప్రజాస్వామ్య దేశానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. గతంలో కూడా జర్నలిజంపై ఉక్కుపాదం మోపిన రాజకీయాలు నేడు కాలగర్భంలో కలిసిపోయాయని, అదే పరిస్థితి బిఆర్ ఎస్ పార్టీకి ఏర్పడుతుందని హితవు పలికారు.ఇలాంటి ఘటనలను ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, ప్రజాసంఘాలు,ప్రజలు తీవ్రంగా ఖండించాలని కోరారు. భవిష్యత్ లో మీడియాపై ఇలాంటి ఫటనలు పునఃరావృతం కాకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి మహా న్యూస్ కార్యాలయంపై దాడిని సుమోటోగా తీసుకుని దాడికి కారకులను తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల జర్నలిస్ట్ లను కలుపుకుని ఉద్యమం చేపడతామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కర్నూలు నగర కార్యదర్శి మునిస్వామి,సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాధ్ రెడ్డి,ప్రింట్ / ఎలక్ట్రానిక్ కర్నూలు జిల్లా నాయకులు అవినాష్, కిషోర్, పరమేష్, అసిఫ్, రాజశేఖర్, వై.వి.రెడ్డి, గిలిగిత్త విజయ్ కుమార్, పి.జి.వెంకటేష్,లక్ష్మి నారాయణ, శేఖర్,మధు,నరసింహ, రఫీ, రాము, విద్యార్థి సంఘాలు ఎస్ ఎస్ ఐ నాయకులు అమర్,పిడిఎస్ యు నాయకులు రమణ,జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.