నకీలు విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

నకీలు విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ఓర్వకల్లు, న్యూస్ వెలుగు : ఎరువులు, విత్తన దుకాణాలలో నకీలి విత్తనాలు, పురుగు మందులువిక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఓ మధుమతి అన్నారు. గురువారం మండలంలోని లొద్ది పల్లె ఓర్వకల్లు ఉన్న ఎరువులు, పురుగుల మందు దుకాణాలలో తనిఖీ చేసి రికార్డులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపా రులు ఎరువులు, విత్తనాలు రైతులకు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, విక్రయాలకు సంబందించిన రసీదులు రైతులకుఇవ్వాలని ఆదేశించారు. ఫర్టిలైజర్ దుకాణాలలో అనుమతులు లేని విత్తనాలు, ఎరువులు, పురుగులమందులు విక్రయిస్తే లైసెన్స్ రద్దుచేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఏఈఓ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!