రాయచోటిలో ఉపాధ్యాయుడిని చంపిన విద్యార్థులు
తరగతి గదిలోనే జరిగిన ఈ దారుణం
రాయచోటి, న్యూస్ వెలుగు; రాయచోటిలోని కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడి పై తొమ్మిదవతరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తరగతి గదిలోనే దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వల్ల ఉపాద్యాయుడు మృతి చెందినట్లు సమాచారం. విద్యార్థుల మద్య జరుగుతున్న ఘర్షణ ఆపిన ఉపాధ్యాయుడు.ఇద్దరు అన్నదమ్ములు మరొక విద్యార్థి కలిసి ఇతర విద్యార్థుల మీద దౌర్జన్యం చేసిన సందర్భంలో వారిని అడ్డుకున్న ఉపాధ్యాయుడు దీంతో ఒక్కసారిగా ఉపాధ్యాయుడి పై ఆ ముగ్గురు పిడిగుద్దులతో చెస్ట్ మీద , ముఖం మీద దాడికి పాల్పడటంతో కళ్ళద్దాలు కూడా విరిగిపోయిన పరిస్థితులలో మిగిలిన విద్యార్థులు విడిపించగా తీవ్ర ఆవేదనలో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఉపాధ్యాయుడు. వెంటనే ఆసుపత్రిలో చేర్చిన తోటి ఉపాధ్యాయులు.కాసేపటికే ప్రాణాలు కోల్పోయిన హృదయ విషాదకర, విచారకరమైన ఈ సంఘటనను ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఉపాధ్యాయ సమాజం విశ్లేసించుకోవాలి.
ఎటు పోతోంది నేటి యువత!