
‘ఎడ్‌మెడ్ AI’ ఆధారిత CBME పైలెట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించినసూపరిండెంట్ కే వెంకటేశ్వర్లు
కర్నూలు, న్యూస్ వెలుగు ; ఆధునిక సాంకేతికతను వైద్య విద్యలో సమర్థవంతంగా వినియోగిస్తూ, విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కర్నూలు మెడికల్ కాలేజీ (KMC)లో ‘ఎడ్‌మెడ్ AI’ (EdMed AI) ఆధారిత CBME పైలెట్ ప్రాజెక్ట్‌ను అడిషనల్ డీఎంఈలు, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (NTRUHS) ఆధ్వర్యంలో, జాతీయ వైద్య కమిషన్ (NMC) మార్గదర్శకాలకు అనుగుణంగా అమలులో ఉన్న Competency Based Medical Education (CBME) విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ AI ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టారని రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ప్రాయోగికంగా అమలు చేయబడుతున్న ఈ పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా కర్నూలు మెడికల్ కాలేజీ ఎంపిక చేయడం పట్ల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా “వైద్య విద్యలో డిజిటల్ పరివర్తనకు ఇది ఒక ముఖ్యమైన అడుగు అని విద్యార్థులు సాంకేతిక వనరులను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి” అని కోరారు.“AI ఆధారిత ఈ విద్యా వేదిక ద్వారా భవిష్యత్తులో వైద్య విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతారు” అని అన్నారు. Edmed AI రూపకర్త డాక్టర్ చంద్రశేఖర్ బందుగల ఇదే కాలేజీ పూర్వ విద్యార్థి కావడం అమెరికాలో మెడికల్ ఎడ్యుకేషన్ లో గ్రాడ్యుయేషన్ చేసి చక్కటి అనుభవంతో తిరిగి మన దేశ వైద్య విద్యార్థులకు ఏఐ సేవలు అందించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.
EdMed AI ప్లాట్‌ఫామ్ ప్రత్యేకతలు
‘EdMed AI’ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులు మరియు అధ్యాపకులకు కింది సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి:
2,695 కంటే ఎక్కువ NMC గుర్తింపు పొందిన కంపెటెన్సీల ఆధారంగా రూపొందించిన డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్స్,NEET PG, INI-CET, USMLE వంటి జాతీయ, అంతర్జాతీయ పరీక్షలకు ప్రత్యేక ప్రిపరేషన్ మెటీరియల్
లెక్చర్ ప్లాన్లు (Lecture Plans), ప్రెజెంటేషన్లు, క్లినికల్ నోట్స్, ప్రాక్టీస్ ప్రశ్నలు,అసెస్‌మెంట్ టూల్స్ మరియు ప్రోగ్రెస్ ట్రాకింగ్ సిస్టమ్అధ్యాపకులకు బోధనలో సులభతరం చేసే AI ఆధారిత సహాయక విధానాలు
ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థుల వ్యక్తిగత అభ్యాస శైలి (Personalized Learning)కు అనుగుణంగా మార్గదర్శనం లభిస్తుంది. అలాగే అధ్యాపకులకు బోధనలో సమర్థత పెరుగుతుంది.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ విజయ్ ఆనంద్ బాబు, డాక్టర్స్ సింధియా శుభప్రద,ఏవో నాగమణి మరియు ఇతర అధ్యాపకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

