
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి
న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు శనివారం పెద్దపాడులోని దామోదర్ సంజీవయ్య స్మారక ప్రభుత్వ బాలికల పాఠశాల, ఎస్.ఏ.పి. క్యాంపులోని కట్టమంచి రామలింగారెడ్డి స్మారక ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలకు కమిషనర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, సదుపాయాలు కల్పనకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య బలమైన బంధం ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణలలో భాగంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పేరుతో సమావేశాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ప్రతిజ్ఞ, తల్లిదండ్రులకు తాడులాట తదితర క్రీడలను నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.