ముద్దటమాగి ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడి సస్పెన్షన్

ముద్దటమాగి ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడి సస్పెన్షన్

 కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా హొళగుంది మండలం ముద్దటమాగి ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయరాజు మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఘటనలో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల టాయిలెట్ లో మద్యం సీసాలను గుర్తించిన విద్యార్థులను, మద్యం సీసాలు చూశారన్న ఆగ్రహంతో విద్యార్థులను చితకబాదినట్లు ఎంఈఓ జగన్నాథం నివేదిక ఇచ్చారు. నివేదిక ఆధారంగా ఉపాధ్యాయుని సస్పెండ్ చేయడమైనదని జిల్లా విద్యాశాఖ అధికారి గారు పేర్కొన్నారు . ఉపాధ్యాయుడు రోజు మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నట్లు ఎంఈఓ ప్రాథమిక విచారణలో నివేదించారని, ఉపాధ్యాయుడి సస్పెన్షన్ చేయడం జరిగినది. జరిగిన ఘటన తీవ్రత ఆధారంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని హొళగుంద మండల విద్యాధికారి ని ఆదేశించడమైనది.

Author

Was this helpful?

Thanks for your feedback!