రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
హోళగుంద,న్యూస్ వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులను రైతులు,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ సతీష్ అన్నారు.మండల పరిధిలోని హెబ్బటం గ్రామంలో సర్పంచ్ కృష్ణవేణి అధ్యక్షతన రెవిన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరి ష్కారం కోసం రెవిన్యూ సదస్సు నిర్వహిస్తుందని రైతులు,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అలాగే రైతులు తమ భూములకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే రెవెన్యూ సదస్సులో అర్జీని అందిస్తే భూ సమస్యను పరిష్కరిస్తామన్నారు.సమావేశం వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఈ సమావేశంలో 22 మంది రైతులు భూ సమస్యల పై అర్జీ సమర్పించారు.అలాగే 38 ఆదాయ,కుల ధ్రువీకరణ పత్రాలు అందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్,విఆర్వోలు దామోదర,నాగరాజు,ప్రహ్లాద,లక్ష్మీకాంత్ రెడ్డి,తిప్పన్న,కంప్యూటర్ ఆపరేటర్ బసవ,గ్రామ సేవకులు,సచివాలయం సిబ్బంది,గ్రామస్తులు నర్సప్ప,వన్నూరప్ప,పక్కిరప్ప,వివిధ శాఖల అధికారులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.