హోళగుంద, న్యూస్ వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులను రైతులు,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ సతీష్ అన్నారు.మండల పరిధిలోని వందవాగలి గ్రామంలో మంగళవారం సర్పంచ్ కురువ హనుమంతమ్మ అధ్యక్షతన రెవిన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన

మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం రెవిన్యూ సదస్సు నిర్వహిస్తుందని రైతులు,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అలాగే రైతులు తమ భూములకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే రెవెన్యూ సదస్సులో అర్జీని అందిస్తే భూ సమస్యను పరిష్కరిస్తామన్నారు.సమావేశం వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఈ సమావేశంలో 12మంది రైతులు భూ సమస్యల పై అర్జీ సమర్పించారు.అలాగే 24 ఆదాయ,కుల ధ్రువీకరణ పత్రాలు అందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్,విఆర్వోలు దామోదర,ప్రహ్లాద,కంప్యూటర్ ఆపరేటర్ బసవ,గ్రామ సేవకులు,సచివాలయం సిబ్బంది,గ్రామస్తులు దేవాదాయశాఖల అధికారి నరేంద్ర,వివిధ శాఖల అధికారులు,సర్పంచ్ భర్త శేషన్న,డీలర్ గంగాధర,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!