వైద్యసేవలను సద్వినియోగం చేసుకోండి : వైద్యాధికారి ప్రవీణ్
తుగ్గలి మండలం ( న్యూస్ వెలుగు ): కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రామకొండ గ్రామపంచాయతీ పరిధిలో 104 ఆరోగ్య క్యాంపు ను నిర్వహించడం జరిగిందని వైద్యాధికారి ప్రవీణ్ తెలిపారు. గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలను రోగులకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ రాజేంద్ర, ఫార్మా అసిస్టెంట్ రాఘవేంద్ర, ఏఎన్ఎం విశాలాక్షి, ఆశ వర్కర్లు నిర్మల,జమున పాల్గొని పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రధానంగా గర్భిణీ మహిళలకు రెగ్యులర్ చెకప్ లు కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. బిపి షుగర్ ఇతర సీజర్ వ్యాధుల పైన ప్రజలకు అవగాహన కల్పించినట్లు వైద్యాధికారి ప్రవీణ్ తెలిపారు. రోగులకు మందులను కూడా అందించినట్లు పేర్కొన్నారు . గ్రామంలో 104 వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి ప్రవీణ్ ప్రజలకు సూచించారు.