గోజాతి సంరక్షణ మహోన్నతమైన వ్రతం

గోజాతి సంరక్షణ మహోన్నతమైన వ్రతం

శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ

కర్నూలు, న్యూస్ వెలుగు;   గోజాతి సంరక్షణ మహోన్నతమైన వ్రతమని, గో సంతతి వృద్ధితోనే లోకం సుభిక్షంగా ఉంటుందని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరశివారులోని గోదాగోకులంనందు వెలసిన శ్రీ గోదా రంగనాథ స్వామి దేవస్థానం నందు కనుమ పండుగ సందర్భంగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన గోపూజా కార్యక్రమంలో వారు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి బృందానన రామానుజ జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శఠగోపముని రామానూజ జీయర్ స్వామి, గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు అర్చకులు రమేశ్ బట్టర్ ఆచార్యులు, యం.రాంభూపాల్ రెడ్డి, మాకం శ్రీనివాసులు, రాధాకృష్ణ పి.వి.సుబ్రమణ్యం, పాలాది సుబ్రహ్మణ్యం, వేముల జనార్ధన్, పెరుమాళ్ళ బాల సుధాకర్, బచ్చు నాగ సురేశ్, వేముల ఎల్లయ్యతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కనుమ పండుగ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంతో పాటు మిడుతూరులోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు గోపూజ తోపాటు గో విశిష్టతపై ధార్మిక ప్రవచనాలు నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!