మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు

మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు

తుగ్గలి ,న్యూస్ వెలుగు: కడప జిల్లాలో మూడు రోజులపాటు జరుగుచున్న మహానాడు 43 వసంతాల మహోత్సవ సంబరాలకు తుగ్గలి మండల వ్యాప్తంగా గల తెలుగుదేశం పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు మరియు ఏన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.ఏడాదికి ఒకసారి నిర్వహించే పసుపు పండుగకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో మంగళవారం రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలివెళ్లారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించే మహానాడు కార్యక్రమానికి నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలివస్తున్నారని,కడప జిల్లా మొత్తం మూడు రోజులపాటు పసుపుమయంగా మారుతుందని వారు తెలియజేశారు.మూడు రోజులపాటు నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు,ఉపాధ్యక్షుడు వెంకటరాముడు చౌదరి,జొన్నగిరి సర్పంచ్ ఓబులేసు,విద్యా కమిటీ చైర్మన్ మిద్దె రవి,మిద్దె వెంకటేశ్వర్లు,తిమ్మప్ప యాదవ్,డాక్టర్ చంద్ర,చంద్రబోస్, తదితర మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

Author

Was this helpful?

Thanks for your feedback!