
నేడు నునుసరాళ్ళ గ్రామంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం..
మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని గల నునుసరాళ్ళ గ్రామంలో ఆదివారం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పత్తికొండ శాసనసభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు తుగ్గలి మండల టీడీపీ అధ్యక్షులు తిరుపాల్ నాయుడు ఆధ్వర్యంలో గ్రామ టీడీపీ నాయకుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు తెలియజేశారు. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు సభ్యత్వాన్ని నమోదు చేసుకుని పార్టీకు గుర్తింపు తీసుకురావాలని మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు తెలియజేశారు. కావున ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుగ్గలి మండల టీడీపీ అధ్యక్షులు తిరుపాల్ నాయుడు తెలియజేశారు.