
టిడిపి సర్పంచ్ పార్టీకి రాజీనామా
సభ్యత్వం లేని వ్యక్తికి ఈరన్న స్వామి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి ఎలా కట్టబెట్టారు ; సర్పంచ్ లక్కీ గోవిందు
కౌతాళం, న్యూస్ వెలుగు : కౌతాళం మండలం లోని ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి కోసం టిడిపి పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీ కోసం కష్టపడిన ఆశావాహులకు కాకుండా కనీసం టిడిపి సభ్యత్వం కూడా లేని పాండురంగయ్య శెట్టి కి మేము పదవి ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదని టిడిపి సీనియర్ నాయకులు వాపోయారు.తెలుగుదేశం పార్టీకి గోతుల దొడ్డి సర్పంచ్ రాజీనామా..తెలుగుదేశం పార్టీకి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా మంత్రాలయం నియోజకవర్గం లోని కౌతాళం మండలం గోతుల దొడ్డి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ లక్కీ హనుమంతమ్మ ఆమె భర్త తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు లక్కే గోవింద్ రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు… గత 30 సంవత్సరాలుగా ఓకే పార్టీ నమ్ముకుని పార్టీ కోసం కష్టపడితే పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు అయినా పార్టీ కార్యకర్తలను గుర్తించకపోవడం చాలా బాధాకరమన్నారూ. పార్టీ అధికారంలో లేనప్పుడు కేసులు పెట్టించుకుని ఆస్తులు అమ్ముకున్నామని..ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పాండురంగయ్య శెట్టి కి ఉరుకుంద ఈరన్న స్వామి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు., ఆయన ఏరోజైనా పార్టీ కోసం కష్టపడ్డాడా ..!!పార్టీ జెండా మోసాడా…!! కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తికి ఏం ఆశించి పదవి కట్టబెట్టారు..? ఇలా చేసుకుంటూ పోతే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు, జడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల్లో పార్టీకి చాలా నష్ట వాటిల్లుతుంది. మనలాంటి నిక్కరసైన నాయకులను గుర్తించక పోవడం చాలా బాధాకరం.నా వంతుగా నా గ్రామ ప్రజలకు సేవ సంక్షేమం అభివృద్ధి అందించాను.2019 తెదేపా అధికారం లేకపోయినా నన్ను తెదేపా పార్టీని నమ్మి నా గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకొని, రాక్షస పాలనలో కూడా ఒడిదొడుకులు ఎదుర్కొని నిలబడ్డం.ఈరోజు మనలాంటి వాళ్ళని పార్టీ గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం.నాకు సహకరించిన నా గ్రామ ప్రజలకు,కార్యకర్తలకు మరియు నాయకులకు గోతులదొడ్డి సర్పంచ్ లక్కే హనుమంతమ్మ మరియు లక్కీ గోవిందు ధన్యవాదాలు తెలిపారు.

