
తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు పూర్తి : డా.కె.వెంకటేశ్వర్లు
కర్నూలు (న్యూస్ వెలుగు ): ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా కర్నూలు రాగమయూరి వద్ద సభా ప్రాంగణంలో రెండు తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి అడిషనల్ డి ఎం ఈ & సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రముఖులతో పాటు ప్రజలకు అత్యవసర సమయంలో ప్రాథమిక సేవలందించ నున్నట్లు తెలిపారు. వైద్యులు మరియు వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రముఖులకు పది పడకల ఆసుపత్రి, సామాన్య ప్రజలకుల 20 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి, ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా 15 పార్కింగ్ ప్రదేశాల్లో 104, 108 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి ఇంచార్జ్ సి ఎస్ ఆర్ ఎం ఓ, డా.వెంకటరమణ, డిసిహెచ్ఎస్, డా.జఫ్రుల్లా, అసోసియేట్ ప్రొఫెసర్, డా. శివబాల, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
