రైతు వ్యతిరేక కూటమి ప్రభుత్వానికి ప్రజాగ్రహం గురి కాక తప్పదు

రైతు వ్యతిరేక కూటమి ప్రభుత్వానికి ప్రజాగ్రహం గురి కాక తప్పదు

ఎస్ వి మోహన్ రెడ్డి  వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు

న్యూస్ వెలుగు, కర్నూలు;  మంగళవారం  మాజీ ఎమ్మెల్యే  కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, ఒకవైపు రైతులకు మద్దతు ధర లేక రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రైతులకు మేలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు రైతు పక్షపాతి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు వారికి చేపట్టి రైతులకు అండగా నిలిచారని తెలిపారు. రైతులను దగా చేసినటువంటి కు టమి ప్రభుత్వ చర్యలు నిరసిస్తూ ఈ నెల 13వ తేదీన నిరసన కార్యక్రమం చేపట్టామని ఈ కార్యక్రమానికి ప్రస్తుతం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎంపీలు పాల్గొంటారని కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని కోరారు 13వ తేదీ కర్నూల్ నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి రైతులు కూడా తరలిరావాలని పిలుపునిచ్చారు సమావేశంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కాగంటి శ్రీదేవి కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి సతీష్ కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!