సూపర్డెంట్ ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సంఘనేతలు
Kurnool (కర్నూలు ): జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన ఈరన్న గత ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించడం జరిగిందని ఆసుపత్రి వైద్యులు నిర్దారించడంతో మృతదేహాన్ని బందువులు స్వగ్రామానికి తరలించేందుకు ప్రయివేట్ అంబులెన్స్ ని సంప్రదించగ వాళ్ళు పదిహేనువేల రూపాయలు డిమాండ్ చేశారని అంతా డబ్బులు తమ దగ్గర లేకపోవడంతో … ఏమిచేయాలో తెలియని పరిస్తితుల్లో ఆసుపత్రి సూపర్డెంట్ డా. ప్రభాకర్ రెడ్డిని సంప్రదించిన మృతుడి బందువులు ఆయన ( మహా ప్రస్థానం) ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో పార్థీవదేహాన్ని అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలించినట్లు తెలిపారు. ఇందుకు సహాయం అందించిన ఆసుపత్రి సూపర్డెంట్ డా. ప్రభాకర్ రెడ్డికి మృతుడి బందువులు, మదాసికురువ నాయకులు సుంకన్న కృతజ్ఞతలు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!