రైతుల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం: మాజీ జిల్లాపరిషత్ ఛైర్మన్

రైతుల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం: మాజీ జిల్లాపరిషత్ ఛైర్మన్

 రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసిన టిడిపి నాయకులు.

తుగ్గలిన్యూస్ వెలుగు: 

తుగ్గలి మండల వ్యాప్తంగా అన్ని రైతు సేవ కేంద్రాల యందు సబ్సిడీ వేరుశనగ విత్తనాలను గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అధికారులు సోమవారం రోజున రైతులకు పంపిణీ చేశారు.సోమవారం రోజున చెన్నంపల్లి రైతు సేవ కేంద్రం నందు రాష్ట్ర గిరిజన సలహామండలి సభ్యులు వెంకటపతి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, గ్రామ టిడిపి నాయకులు మా భాష రాజేంద్ర గౌడ్ లక్ష్మీనారాయణ లు వ్యవసాయ అధికారులతో కలిసి రైతులకు సబ్సిడీ వేరుశన విత్తనాలను పంపిణీ చేశారు. అదేవిధంగా రాంపల్లి గ్రామం నందు మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలను పంపిణీ అదేవిధంగా పెండేకల్ గ్రామం నందు సర్పంచ్ లీలావతి,ఎంపీటీసీ పెద్ద రంగన్న, మాజీ సర్పంచ్ బర్మా వీరేష్ లు రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. అదేవిధంగా రామకొండ రైతు సేవ కేంద్రం నందు మాజీ సర్పంచ్ మసాలా శీను,డాక్టర్ చంద్ర,ఐటిడిపి నాయకులు నాగరాజు తదితరులు రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కొరకే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వారు తెలియజేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని వారు తెలియజేశారు. రైతుల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించారని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!