ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలి

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలి

మిగిలిన బ్యాంకుల మొత్తం రిజర్వుల కంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రిజర్వులు రూ .1400 కోట్లు
     సి.ఐ.టి.యు. డిమాండ్
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే సి.ఐ.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. అంజిబాబుడిమాండ్ చేశారు సిఐటియు నిర్వహించు విడతల వారి ఆందోళనలో భాగంగా 14వ తేదీన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం దగ్గర (భాగ్యనగర్) ఆందోళన చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్. రాధాకృష్ణ అధ్యక్షతన కార్మిక కర్షక భవన్ నందు జరిగిన సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇతర మూడు బ్యాంకులను కలిపి ఆర్బిఐ ఒకే బ్యాంకు గా మార్చడం జరిగిందని అయితే ప్రధాన కార్యాలయం అమరావతికి తరలించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని అది సరైనది కాదని ఆయన అన్నారు ఆర్.బి.ఐ సూచించిన సూచనల ప్రకారం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోనే ఉండడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని ఆయన అన్నారు మిగిలిన బ్యాంకుల మొత్తం రిజర్వుల కంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రిజర్వులు 1400 కోట్లు ఎక్కువగా ఉందని తెలిపారు అన్ని బ్యాంకుల మొత్తం కస్టమర్ల కంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కస్టమర్లు ఎక్కువమంది ఉన్నారని అలాగే బ్రాంచీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని తెలిపారు కడపలో సొంత భవనమే ఉండడం కాకుండా అన్ని జిల్లాలలోనూ సొంత బోనాలు ఉన్నాయని ఏటీఎంలు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు కావున ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలోనే ఉండాలని డిమాండ్ చేశారు దీనికోసం సిఐటియు విడతల వారి ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న సాయిబాబా జిల్లా కార్యదర్శులు విజయ్, ప్రభాకర్, జే.నాగేశ్వరరావు, నారాయణస్వామి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!