మానవ శరీరమే శక్తి నిలయం
ఆక్యుప్రెజర్ తో మానసిక ఒత్తిడి దూరం, శరీర రుగ్మతలు పరిష్కారం
అరచేతులే ఆయుధాలు
స్ట్రెస్ రిలీఫ్ మరియు ఆకుప్రెషర్ తెరపిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్
గుంటూరు: చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ మోతడగా ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టూడెంట్ కౌన్సిలర్ మరియు స్ట్రెస్ రిలీఫ్ తెరపిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ హాజరయ్యారు. ముంజంపల్లి మాట్లాడుతూ విద్యార్థుల ఉద్దేశించి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు తల్లిదండ్రులని మరియు ఉపాధ్యాయుల్ని గౌరవిస్తూ చదువుని కష్టంతో కాకుండా ఇష్టంతో చదివిన నాడే ఉన్నత శిఖరాలకు వెళ్ళవచ్చునని సంకల్పం గట్టిగా ఉంటే ఎంతటి కార్యం అయినా సాధించవచ్చునని, చదువుతోపాటు విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలని సమాజానికి సేవ చేయాలని ఆయన సూచించారు. ఈరోజుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న డిప్రెషన్, నిద్రలేనితనం, ఆందోళన, సూసైడ్ పెండెన్సీ వాటిని ఎలా ఎదుర్కోవాలో సలహాలు సూచనలను ఆక్యుప్రెజర్ పాయింట్స్ తో ప్రాక్టికల్ గా విద్యార్థులకు వివరించారు. మానవ శరీరమే శక్తి నిలయమని మానవ శరీరంలో 12 ఆర్గాన్స్ ఉంటాయని ఏ ఆర్గానులో శక్తి తగ్గుతుందో అప్పుడే రోగం రూపంలో బయట వేస్తుందని ఆ శక్తిని పునర్ నిర్మితం చేయడానికి రోజుకి ఐదు నుండి పది నిమిషాలు భజన చేయడం ద్వారా శక్తి పునరుత్పత్తి అవుతుందని యోగశక్తి చికిత్స ద్వారా పాయింట్స్ వలన శారీరిక మానసిక రుగ్మతలు దూరం చేయవచ్చునని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.