పెంచిన ట్రూ ఆప్ కరెంట్ ఛార్జీలను రద్దు చేయాలి

పెంచిన ట్రూ ఆప్ కరెంట్ ఛార్జీలను రద్దు చేయాలి

ఆదానితో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి
విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయం ముందు ధర్నా

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

కర్నూలు, న్యూస్ వెలుగు; ట్రూ ఆప్ చార్జీలను, పెంచిన కరెంట్ ఛార్జీలను రద్దు చేయాలనీ, ఆదానితో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలనీ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. అనంతరం కర్నూలు పట్టణంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో దీన్నేదేవరపాడు రోడ్డు నుండి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేయడం జరిగింది. అనంతరం విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాకూర్ రామ షింగ్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
అనంతరం బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, అఖిల భారత రైతుకులి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ టారిఫ్ ల పేరుతో విద్యుత్ వినియోగదారులపై మోపుతున్న అన్ని రకాల అదనపు ఛార్జీలను రద్దు చేయాలనీ ఇప్పటికే నాలుగు దఫాలుగా ట్రూ ఆఫ్, ఎఫ్.పి.పి.సి.ఏ పేర్లతో ఆర్ధిక భారాలు మోపిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మరోసారి వేలకోట్ల రూపాయల అదనపు భారాలు వేయడానికి బూటకపు విచారణ సాగిస్తున్న పరిస్థితుల్లో అన్ని రకాల ట్రూ ఆఫ్, ఎఫ్.పి.పి.సి.ఏ ఛార్జీలను రద్దు చేయాలని, ఇప్పటి వరకు వసూలు చేసిన వాటిని ప్రజలకు వెనక్కి తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఒక యూనిట్ కి 2.49 పైసలు చేయించేందుకు చేసుకున్న ఒప్పందంలో 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారన్న వార్తలు చూస్తున్నామని మరి అంతకుముందు ఒక యూనిట్ కి 4.50 పైసలకు చేసుకున్న ఒప్పందంలో ఇంకెన్ని కోట్లు అవినీతి జరిగి ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలు ప్రజల మేలు కోసం కాకుండా ప్రైవేటు కంపెనీల లాభాల కోసం పనిచేస్తున్నాయని అన్నారు. కావున సోలార్, పవన్ విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వమే చేయాలని ప్రజలపై వేసిన అన్ని రకాల విద్యుత్ టారిఫ్ అని రద్దు చేయాలని ముఖ్యంగా స్మార్ట్ మీటర్ల బిగింపును నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీ డీ ఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మణి, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు, సహాయ కార్యదర్శులు వెంకటస్వామి, గోపాల్, పట్టణ పేదల సంఘం నాయకులు జోలాపురం రాజు, పీ డీ ఎస్ యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అఖండ, మహేంద్ర, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు రాము, రమణ, మౌలాబి, రవి, బ్రహ్మయ్య,దామోదర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!