FlatNews Buy Now
జీవోను దగ్ధం చేసిన కార్మిక సంఘాలు

జీవోను దగ్ధం చేసిన కార్మిక సంఘాలు

పత్తికొండ న్యూస్ వెలుగు :  లేబర్ కోడ్ల అమలకు వ్యతిరేకంగా సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పత్తికొండ పట్టణంలోని స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నుండి నాలుగు స్తంభాల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరసన్న అధ్యక్షతన వహించగా సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర మాట్లాడుతూ బానిసత్వాన్ని కార్మిక వర్గంపై రుద్దేందుకే ఈ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేశారని కార్పొరేటర్లకు కార్మిక వర్గాన్ని కట్టు బానిసగా చేసేందుకు కార్మిక వ్యతిరేక మార్పులను తీసుకురావడానికి ఇలాంటి దుచ్చెర్య చేపట్టారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒంటెద్దు పోకడను వెంటనే విరమించుకోవాలని లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని సిఐటియు కార్మిక సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్మికులు ఏదైనా ఒక కంపెనీలో పని చేస్తున్న సమయంలో లాకౌట్ చేయాలంటే వందమంది అంతకుమించి కార్మికులు ఉంటే ఆ సంస్థ తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలని ఇప్పుడు ఆ నిబంధనలు కాస్త 300 మంది కార్మికులు ఉండేలా కార్మిక చట్టాన్ని మార్చడం దుర్మార్గమైన చర్య అని 300 మందికి తక్కువ ఉన్న కంపెనీలు కార్మికులపై ఇష్టానుసారంగా వారి పెత్తనాన్ని అవలంబించే విధానం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఇంతటి దుర్మార్గమైన చట్టాలను వెంటనే వెనక్కు తీసుకొని 29 చట్టాలను అమల్లో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

అనంతరం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నాలుగు లేబర్ కోడ్ల జీవోను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజులు, శికామణి, ప్రజానాట్యమండలి నాయకులు పి.కాశన్న, డివైఎఫ్ఐ నాయకులు డి. అలిపిర, బజారు హమాలి వర్కర్స్ యూనియన్ మేస్త్రి ఉరుకుందు, సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చిన్న హుస్సేన్, చంద్ర, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు కాశన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రంగనాథు, ముస్లిం మైనార్టీ నాయకులు హజరత్, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!