రాష్ట్ర సచివాలయంలో ముగిసిన మంత్రి వర్గ సమావేశం
అమరావతి, న్యూస్ వెలుగు; ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నేడు రాష్ట్ర సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు మంత్రి వర్గ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే మూడేళ్ళలో రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అభివృద్ధిపై CRDA అథారిటీ సమావేశ నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందన్నారు. గత ప్రభుత్వం పాత టెండర్లను రద్దు చేయడంతో కొత్త టెండర్లను పిలిచామన్నారు.దీంతో 2వేల 507 కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడిందన్నారు.11వేల 471 కోట్ల రూపాయలతో అమరావతిలో పనులు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అమరావతిని ప్రపంచంలోనే ఐదు అద్భతమైన రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు.