పెరవలి గ్రామం నందు పొలం పిలుస్తోంది కార్యక్రమం
మద్దికేర న్యూస్ వెలుగు ప్రతినిధి:మద్దికేర మండల పరిధిలోని గల పెరవలి గ్రామం నందు మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి ఆధ్వర్యంలో బుధవారం రోజున పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు నిర్వహించారు. ముందుగా పెరవలి గ్రామంలోని రైతు సురక్ష కేంద్రం నందు పొలం పిలుస్తోంది కార్యక్రమం పై వ్యవసాయ అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. అనంతరం పెరవలి గ్రామంలోని ఆంజనేయ పొలం నందు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కంది మరియు వేరుశనగ పంటల సాగు నందు తీసుకోవలసిన పలు మెలకువలను మరియు జాగ్రత్తలను వ్యవసాయ అధికారులు రైతులకు వివరించారు. వ్యవసాయ అధికారుల సూచనలను సలహాల ద్వారా తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులను రాబట్టవచ్చని మండల వ్యవసాయ అధికారి రవి రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యాన సహాయకురాలు ఇంద్రజ,గ్రామ టిడిపి నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.