విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలి

విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలి

న్యూస్ వెలుగు కర్నూలు :   జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మంగళవారం కర్నూలు జిల్లా న్యాయ సేవాసదన్ నందు గవర్నమెంట్ లైన్ డిపార్ట్మెంట్ల లతో ఏర్పాటు చేసిన సాథి కమిటీ తో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న దిక్కులేని/అనాధ పిల్లలను గుర్తించడంపై సమీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సాథి కమిటీ ఉమ్మడి జిల్లా ల వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించి 125 మంది ఆధార్ కార్డ్స్ లేని పిల్లలను గుర్తించడం జరిగిందని జడ్జి తెలిపారు. వీరందరికి ఈ నెల 26 తరువాత నుంచి ప్రత్యేక ఆధార్ సెంటర్ లని ఏర్పాటు చేసి లైన్ డిపార్ట్మెంట్ ల సహకారం తో ఆధార్ కార్డ్స్ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కమిటీ దిక్కులేని పిల్లలను గుర్తించి ఆధార్ కార్డులను ఇప్పించడంతో పాటు వివిధ గవర్నమెంట్ పథకాలతో అనుసంధానం చేసి విద్య మరియు గవర్నమెంట్ పథకాలన్నీ వర్తింప చేసేలా కృషి చేస్తాయని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క అనాధ దిక్కులేని పిల్లలకు ఆధార్ కార్డులు కలిగి ఉండేలా ఈ డిపార్ట్మెంట్లన్నీ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఎవరికైనా అనాధ పిల్లలు కనిపించిన 15100 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే వెంటనే న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. సమావేశంలో ఐసిడిఎస్ కర్నూలు మరియు నంద్యాల పిడి నిర్మల, లీలావతి, నంద్యాల అడిషనల్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శారద బాయి, కర్నూలు తహసీల్దార్ ఇంద్రాణి, ప్యానల్ లాయర్ వెంకటేశ్వర్లు మరియు ప్యారా లీగల్ వాలెంటీర్స్ రాయపాటి శ్రీనివాసులు,సుధారాణి, హేమంత్ మరియు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!