డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం తగదు
ఆర్విపిఎస్ రాష్ట్ర కార్యదర్శి కేసీ.పాములేటి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు లోని ప్రభుత్వ అధితి గృహం లో ఆర్విపిఎస్ రాష్ట్ర కార్యదర్శి కేసీ పాములేటి మాట్లాడుతూ రాష్టంలో ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వదులుతాము అని చెప్పి వదలకుండా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది అది కూడా టెట్ అనంతరం డీఎస్సీ వదలకుండా డిలే చేస్తు నిరుద్యోగులను మోసం చేయాలనీ చూస్తుంది.గడిచిన నాలుగు నెలలు అవుతున్న డీఎస్సీ నోటిఫికేషన్ పై క్లీరిటీ రాక పోవటం అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు మళ్ళీ కృష్ణ, గుంటూరు, జిల్లలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇంకా ఆలస్యం అవుతుంది.కృష్ణ, గుంటూరు జిల్లాల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని డీఎస్సీ నోటిఫికేషన్ త్వరగా రిలీజ్ చేయాలనీ రాయలసీమ విద్యార్ధి పోరాట సమితి తరుపున కొరత ఉన్నాము. లేని పక్షం లో ఉద్యమనికి పిలును ఇస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో ఆర్విపిఎస్ నాయకులు పాల్గొన్నారు.