ఒంటిమిట్ట న్యూస్ వెలుగు : కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణంలో ఉన్న ఎర్రచందనం పార్కును మాజీ ఎమ్మెల్సీ బత్యాల. చెంగల్ రాయుడు ఆదివారం పరిశీలించడం జరిగింది. ముందుగా ఆయన పార్కులోని ఎర్రచందనం మొక్కలను సంబంధిత ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ఉద్యానవనంలో ఎన్ని ఎర్రచందనం మొక్కలు చనిపోయాయో లెక్క కట్టి ఆ స్థానంలో కొత్త ఎర్రచందనం మొక్కలను నాటాలని ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. ఈ పార్కు పట్టణానికి గుంజన ఏటి పక్కన ఉన్నందువల్ల వరదలకు మొక్కలు కొట్టుకొని పోయి చనిపోవడం జరిగిందని అవి జీవించి ఉన్నింటే 150 కోట్లు మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఉండేది అన్నారు. ఇంకా 2000 కోట్లు విలువచేసే ఎర్రచందనం మొక్కలు పార్కులో ఉన్నాయని అన్నారు.

చనిపోయిన చెట్లను ప్రభుత్వము అమ్మగా వచ్చిన ధనంతో ఏరు గోడ నిర్మించినట్లయితే పార్కు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నారు. కావున సంబంధిత ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పార్కు అభివృద్ధి పై దృష్టి సారించి పట్టణ పర్యావరణాన్ని ప్రభుత్వ ఖజానాను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఫారెస్ట్ అధికారులు పలు పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Written by
Journalist Balu swamy
Thanks for your feedback!