
యోగాంధ్ర ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం
తుగ్గలి ,న్యూస్ వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలోని మండల ప్రజా పరిషత్ మీటింగ్ హాలు నందు మరియు స్త్రీ శక్తి భవనముల యందు యోగాంధ్ర ట్రైనర్లకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకూ ‘యోగాంధ్ర’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు తెలియజేశారు.ఈ నెల 21 నుంచి 27 వరకూ ట్రైనింగ్ అండ్ ట్రైనర్స్ శిక్షణ ఇస్తామని,28 నుంచి జూన్ 3 వరకూ మండల స్థాయిలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ,జూన్ 4 నుంచి 16 వరకూ గ్రామ, వార్డు స్థాయిల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు.చివరిగా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా యోగా డే నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజలు,యువకులు స్వచ్ఛందంగా పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి ఆయుష్ డాక్టర్ అమర్నాథ్, ఎంపీడీవో విశ్వమోహన్,డిప్యూటీ ఎంపీడీవో శ్రీహరి, మహబూబ్ బాషా, మాస్టర్ ట్రైనర్లు రంగస్వామి, లక్ష్మీకాంత్,జయ లక్ష్మమ్మ,శ్రీలేఖ, పంచాయతీ కార్యదర్శులు,సచివాలయ సిబ్బంది మరియు తదితరులు శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.