
కామ్రేడ్ నల్ల కన్ను మృతికి నివాళి ; సిపిఐ
కర్నూలు, న్యూస్ వెలుగు; భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూల్ నగర సమితి ఆధ్వర్యంలో సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ మాజీ చైర్మన్ కామ్రేడ్ ఆర్ నల్ల కన్ను కి కర్నూలు నగర సమితి సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాలాలు వేసి నివాళులు అర్పించడం జరిగినది అమరహే నల్ల కన్ను జోహార్ నల్ల కన్ను అంటూ నినాదాలు చేస్తూ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం

పి రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ సీనియర్ నాయకులు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే జగన్నాథం సిపిఐ సీనియర్ నాయకులు ఎన్ మనోహర్ మాణిక్యం పూలమాల వేశారు వారు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో 26/12/1926 నాడు భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది అదే రోజు కామ్రేడ్ ఆర్.నల్ల కన్నా కూడా జన్మించడం జరిగినది మొదట స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అనంతరం మార్క్సిజానికి ఆకర్షితులై కమ్యూనిస్టు పార్టీ లో చేరి నాటి నుండి తమిళనాడు రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడంలో తన వంతు పాత్ర పోషించి ఆ రాష్ట్రంలోని రైతుల, వ్యవసాయ కూలీల కోసం ఉద్యోగుల కోసం అనేక విరోచితమైనటువంటి పోరాటాలు నిర్వహించి ఎలాంటి తప్పు చేయనటువంటి కేసులో 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీ జెండా వదలకుండా పనిచేసిన నిజాయితీపరుడు నిరాడంబర జీవితాన్ని గడుపుతూ వ్యక్తి నల్ల కన్ను అని నిరాడంబర జీవితం గడిపినటువంటి వ్యక్తికి తమిళనాడు ప్రజలు రెండవ గాంధీగా తెలుసుకునేవారు అలాంటి వ్యక్తికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్టాలిన్ గారు తమిళనాట అవార్డును ప్రకటించి అక్షరాల 10 లక్షల రూపాయలు ఆయనకు రివార్డు అందించగా 10 లక్షలకు మరి 5000 కలిపి 10 లక్షల5 వేల రూపాయలు తిరిగి సీఎం రిలీఫ్ ఫండ్ కి నల్ల కన్నా గారు అందజేయడం జరిగినది ఇంత నిజాయితీపరుడు ఈ తరంలో ఉండడం చాలా అరుదని నల్ల కన్ను మరణం భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శులు సి.మహేష్ డి శ్రీనివాసరావు అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి
కె శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి శ్రావణి నగర కార్యదర్శి వి భారతి
నగర కార్యవర్గ సభ్యులు నాగరాజు అన్వర్ భద్ర కుమార్ ఈశ్వర్ కిట్టు అశోక్ రామాంజి రాముడు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

