మంచి ప్రభుత్వ ప్రజాపాలనకు ”వంద”నాలు – ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
కొండాపురం, న్యూస్ వెలుగు; ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొండాపురం మండలంలో జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యులు చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి , ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి బుధవారం మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వంద రోజుల కూటమి పాలనలో ప్రజలు అందుకున్న లబ్ధిపై నేరుగా లబ్ధిదారులతో మాట్లాడేందుకుగాను సీఎం చంద్రబాబు ఇది మంచి ప్రభుత్వం పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.ఈ మండలంలో రోడ్ల నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి రోడ్ల నిర్మాణంతో పాటు విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. రానున్న కాలంలో మరిన్ని అభివఅద్ధి పనులు చేపట్టి ఎన్నికల హామీలు నెరవేరుస్తామన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని మెజార్టీని కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చారన్నారు. వారి స్ఫూర్తితో సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్త్తున్నారన్నారు. సంక్షేమం అభివృద్ధి వేగంగా చేస్తూ వంద రోజుల పాలనలోనే ప్రజల మన్ననలు పొందడం కూటమి ప్రభుత్వం ఘనత అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే పింఛన్లు పెంచి ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నట్లు తెలిపారు.నిరుద్యోగులకు మెగా డీఎస్సీ 16437టీచర్ పోస్టులు భర్తీచేయనున్నట్లు ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు భూఫేష్ రెడ్డి , ఎంపీడీవో నాగ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.