
వెంకటాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి పదవీ విరమణ
డోన్, న్యూస్ వెలుగు; డోన్ మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి కార్యదర్శిగా పనిచేయుచున్న శ్రీ పి రాజేశ్వరరావు సోమవారం పదవీ విరమణ చేయడం జరిగింది. స్వతహాగా డోన్ మండలం నివాసి అయిన శ్రీ రాజేశ్వరరావు యొక్క సేవలను డోన్ మండల పరిధిలోని దాదాపు అన్ని గ్రామాలలో విధులు విజయవంతంగా నిర్వర్తించడం జరిగినదని ఆయా గ్రామాలలో వారు చేసిన సేవలు గురించి ఆయా గ్రామాల ప్రజలు సన్మాన కార్యక్రమంలో వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఐ నరసింహారెడ్డి డివిజనల్ అభివృద్ధి అధికారి వారు, ఎం శ్రీనివాసులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారు ,పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది
Was this helpful?
Thanks for your feedback!