జేశాప్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎంపికైన విజయ్, భార్గవ్

జేశాప్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎంపికైన విజయ్, భార్గవ్

తుగ్గలి న్యూస్ వెలుగు: జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జేశాప్) జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా తుగ్గలి మండల పాత్రికేయులు విజయ్ (వార్త),భార్గవ్ (ఉదయం న్యూస్) ఎంపికయ్యారు.ఆదివారం రోజున కర్నూలులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా మహాసభలను నిర్వహించారు.జేశాప్ ఉమ్మడి జిల్లాల మహాసభలకు ముఖ్య అతిథులుగా జేశాప్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మరియు కర్నూలు జిల్లా ఇన్చార్జ్ రమణా రెడ్డి,జేశాప్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెంకట రెడ్డి,జేశాప్ స్టేట్ జనరల్ సెక్రెటరీ విజయ్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరై జేశాప్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా విజయ్,భార్గవ్ లను ఎంపిక చేశారు.ఈ సందర్భంగా జేశాప్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎంపిక కాబడిన విజయ్,భార్గవ్ లు మాట్లాడుతూ జేశాప్ అసోసియేషన్ అభివృద్ధి కొరకు తమ వంతు కృషి చేస్తామని వారు తెలియజేశారు.తమపై నమ్మకం ఉంచి తమను ఎంపిక చేసినందుకు జేశాప్ రాష్ట్ర నాయకులకు,జిల్లా కమిటీ సభ్యులకు వారు ఒక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేశాప్ రాష్ట్ర కమిటీ సభ్యులు మోహన్,జిల్లా అధ్యక్షులు చిరంజీవి,రాష్ట్ర మరియు జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!