వెంగల్ రెడ్డి పేట,కడమల కాల్వ గ్రామాలలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు
బండి ఆత్మకూరు వెలుగు న్యూస్: బండి ఆత్మకూరు మండలంలోని వెంగళరెడ్డిపేట కడమల కాల్వ గ్రామాల్లో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలను టిడిపి నాయకులు వెంగల్ రెడ్డిపేట శ్రీనివాసులు మద్దిగారి మదనభూపాల్ ప్రారంభించారు. అనంతరం వెంగల్ రెడ్డి పేట గ్రామంలో 7 లక్షలు, కడమల కాల్వ గ్రామంలో 26 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. టిడిపి నాయకులు మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దస్తగిరి ఈఓఆర్డి వెంకట రాముడు పంచాయతీ సెక్రెటరీ రామచంద్రుడు టిడిపి నాయకులు పాపయ్య మల్లికార్జున తోట శివయ్య, శ్రీనివాసులు, లక్ష్మీ కాంత్ రెడ్డి,మద్దిగారి బలరాముడు,వలి,చాకలి రమేష్, అనకలి మద్దిలేటి, వడ్డె ఎల్లయ్య ,పూల మధు, మురళి,రాజేష్, సుబ్బరాయుడు, మేకల శీను ,చాకలి సురేష్ ,జి.శివ ప్రసాద్, హుస్సేనయ్య వెంకటాపురం రామకృష్ణ టిడిపి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.