
గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య, పోషకాహార కమిటీ సమావేశం
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణులు డాక్టర్ శ్రీ లక్ష్మి,డాక్టర్ రాగిణిల ఆదేశాల మేరకు మద్దికేర మండలం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల లో శుక్రవారం రోజున గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య మరియు పోషకాహార కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఉపసర్పంచ్ ముష్టూరు ప్రమీలమ్మ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య సమస్యలలో ఆశా కార్యకర్తలు వెంటనే స్పందించాలని,గ్రామ ఆరోగ్య పారిశుద్ధ మరియు పిల్లల్లో పోషకాహార లోపాల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలని,తద్వారా నివారణ చర్యలు చేపట్టవచ్చని కోరారు.పారిశుద్ధ లోపాల వల్ల మలేరియా,డెంగ్యూ మరియు నీటి ద్వారా వచ్చే వ్యాధులు ప్రబులుతాయని దీనికై ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని,పోషకాహార లోపాల వల్ల రక్తహీనతకు గురై వ్యాధి, వ్యాధి నిరోధక శక్తి తగ్గి అంటువ్యాధులకు గురి అయ్యే అవకాశం ఉందని,ఆశా కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ఆరోగ్య విద్య అవగాహన ప్రజలకు కలిగించాలని కోరారు,ఈ సమావేశంలో ఉపసర్పంచ్ ప్రమీలమ్మ,వార్డ్ మెంబర్ రామాంజనేయులు,హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా,ఆరోగ్య కార్యకర్తలు లక్ష్మి, అంజలి,పద్మ,సువర్ణ,హెల్త్ ప్రొవైడర్లు మంజుల,ఐశ్వర్య,అంగన్వాడీ సిబ్బంది ఆశా కార్యకర్తలు,కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.