విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి- కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గండి సునీల్ కుమార్
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని జమ్మలమడుగు పట్టణ కేంద్రంలోని ఎన్.జి.ఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి మూడు దపాలుగా అధికారంలోకి వచ్చిన విభజన హామీలు ఏమి అమలు చేయలేదు. ప్రధానమైనది ఆంధ్ర ప్రజల హక్కు అయినా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా చూస్తామని ప్రజలకు బహిరంగంగా చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. నష్టాలు వస్తున్నాయని సాకుతో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనలు కేంద్రం నిర్ణయాన్ని విరవించుకోవాలన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానంతో నాడు 32 మంది ప్రాణ బలిదానంతో ఏర్పాటైన విశాఖ ఉక్కుని ప్రతి ఆంధ్రుడు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని వారన్నారు. అలాగే రాయలసీమ ప్రజలకు తల మాణికమైన లక్షలాదిమంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కల్పవృక్షమైన కడప ఉక్కు ని ఏర్పాటు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని వారు అన్నారు. ఇక్కడ ప్రాంత ప్రజల విద్యార్థులు, యువకులు వలసలతో, కరువుతో ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు చదువుకున్న విద్యార్థులు వలసలు పోతున్నారన్నారు. రాయలసీమకే నడి భాగమైన కడపలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. విభజన హామీలో ప్రధానమైనది కడప ఉక్కు పరిశ్రమ ఉందన్నారు. కావున రాబోవు రోజుల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థులతో విశాఖ ఉక్కు ఆపడం కోసం కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం పోరాటాలకు నాంది పలకపోతుందన్నారు. కావున ఈ పోరాటంలో విద్యార్థులు, మేధావులు కలిసి రావాలని పిలుపునిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో హుస్సేన్ మియా, ఇర్షాద్, మహమ్మద్, ఇమామ్ భాష, కౌశిక్ లు పాల్గొన్నారు.