రెండు రోజులు పాటు నీటి సరఫరాకు అంతరాయం
Jammala Madugu జమ్మలమడుగు (న్యూస్ వెలుగు ): జమ్మలమడుగు నగర పంచాయతి పరిధిలోని దోమర నంద్యాల నుంచి నీరు వదిలే నీటి ట్యాంకును మరమత్తు పనులు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. కొన్ని ఏళ్లు నిలిచిన పనులను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి సూచనల మేరకు ఆగస్టు 9, 10,వ తేదీలో నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. నీటిసరఫరా నిలిపివేయు ప్రాంతాలను వారు వెల్లడించారు … ఎం.డీ.ఓ.ఆఫీస్ రోడ్డు, అమ్మవారి శాల వీధి, అమ్మ భవాని వీధి,ముచ్చర్ల వీధి, పకీరవాడ, టెక్కాయ్య చేను వీధి, డొంకా వీధి, దుత్తలూరు,రోటరీ నగర్, నేతాజీ నగర్, యత్తపు వారి కాలనీ, బ్యాంకు కాలనీ, దిగువపట్నం కాలనీ, లక్ష్మీ నగర్,వెంకటేశ్వర కాలనీ, రామిరెడ్డి పల్లె రోడ్డు, భాగ్యనగర్ కాలనీ, పెద్ద ప సుపుల మోటు, టీచర్స్ కాలనీ మొదలు ఏరియాలో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జమ్మలమడుగు నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. అందుకు ప్రజలు సహకరించాలని త్వరిత గతిన పనులను పూర్తి చేస్తామని తెలిపారు.