జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..

పాత్రికేయులు చైతన్య స్ఫూర్తి కలిగించే వార్తలు వ్రాయాలి
జర్నలిస్టులు విశ్వసనీయత పెంచేలా కృషి చేయాలి
    మంత్రి సత్య కుమార్ యాదవ్

ధర్మవరం , న్యూస్ వెలుగు : సమాజంలో పాత్రికేయులు బాధ్యతతో వ్యవహరించాలని ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు చైతన్య స్ఫూర్తి కలిగించే విధంగా వార్త విషయాలను ప్రజలకు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం ధర్మవరం శివారు ప్రాంతంలోని సి ఎన్ బి ఫంక్షన్ హాల్ లో ఏపీయూడబ్ల్యూజే ధర్మవరం డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా విస్తృతస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆత్మీయ అతిథులుగా ధర్మవరం ఆర్డీవో ఏ .మహేష్ , నాయకులు పరిటాల శ్రీరామ్ చిలకం మధుసూదన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐ వి సుబ్బారావు ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఐజేయు జాతీయ కార్యదర్శి సోమ సుందర్, కార్యవర్గ సభ్యులు సురేష్ కుమార్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అధ్యక్షులు ఏచూరి శివ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సి పుల్లయ్య ప్రధాన కార్యదర్శి బాబు, ఐజేయు కౌన్సిల్ సభ్యులు ఏ శ్రీనివాసులు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎల్ హరికృష్ణ, ధర్మవరం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు జానపాటి మోహన్, ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు జీవీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. తొలుత మంత్రి సత్య కుమార్ యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం అభివృద్ధిలో మీడియా పాత్ర అనే అంశం గురించి చర్చ గోష్టి జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. వార్తా విషయాల సేకరణలో అనుకూల ,ప్రతికూల వార్తలను కూడా సమానంగా ప్రచురించాలన్నారు. ధర్మవరం లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా స్థాయి సదస్సు నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమైనదని పేర్కొన్నారు. ముఖ్యంగా జర్నలిస్టులు వార్తలు సమాజానికి చేరదీసే సమయంలో వాస్తవ విషయాలను గ్రహించాల్సి ఉంటుందని అలాగే జర్నలిజం విలువలు కాపాడుకునేలా ఉండాలని మంత్రి సూచించారు. అంతేగాక ప్రజల్లో విశ్వసనీయత పెంచుకునే విధంగా జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి తెలిపారు. నేటి తరుణంలో మీడియా రంగం ఎంతో వేగంగా దూసుకుపోతున్నదని అలాగే సోషల్ మీడియా కూడా పోటీ తత్వాన్ని అలవర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జర్నలిస్టుల సంక్షేమాభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. సమ సమాజ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమైనదని మంత్రి అన్నారు. ఇటీవల ప్రభుత్వం ఆధ్వర్యంలో గుండెపోటు అకస్మాత్తుగా సోకిన వారికి రూ .45000 ఖరీదైన ఇంజక్షన్ ను ఉచితంగా అందిస్తోందని, అవయవ దానంపై కూడా ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా ఇలాంటి వార్తలు గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగే విధంగా వార్తలను ప్రచురించాలని మంత్రి సూచించారు. జర్నలిస్టులు వృధా అంశాలపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించివద్దని తెలిపారు. పత్రికలు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరా వేసే వేదికలుగా పనిచేయాలని అలాగే ప్రజల హక్కులను రక్షించే కవచాలుగా నిలుస్తూ ప్రజాస్వామ్య విలువలను పత్రికలు కాపాడుతున్నట్లు మంత్రి తెలిపారు.
ముఖ్యంగా ధర్మవరం ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉందని వార్తలు వ్రాసే ముందు వాస్తవ పరిస్థితులను తెలుసుకొని పత్రికల్లో వార్తా విషయాలను ప్రచురించాలని మంత్రి తెలిపారు. ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా, పత్రికా రంగంపై ప్రజలు నమ్మకాన్ని పెంచుకునే విధంగా జర్నలిస్టులు కృషి చేయాల న్నారు. నిజానిజాలను నిగ్గు తేర్చాల్సిన అవసరం పత్రికలపై ఉందన్నారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే సంఘం నాయకులు వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రెవిన్యూ శాఖ మంత్రి సత్య ప్రసాద్, సమాచార శాఖ మంత్రి పార్థసారథి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులతో జర్నలిస్టుల సమస్యలపై చర్చించి అవసరమైన మేరకు చర్యలు తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అర్హులందరికీ అక్రిడేషన్ కార్డు మంజూరు, హెల్త్ కార్డు, పాత్రికేయులకు ఇంటి స్థలాలు గృహ నిర్మాణాలు, ధర్మవరం పుట్టపర్తి ప్రాంతంలో ప్రెస్ క్లబ్ నిర్మాణం తదితర అంశాలను పరిశీలించి వీలైనంతగా జర్నలిస్టు సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. ఇటీవల కాలంలో హిందూపురంనకు చెందిన ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్ట్ మల్లికార్జున కుటుంబానికి ఏపీయూ డబ్ల్యూజే సంఘం ద్వారా రూ. 20,000/- ఆర్థిక సహాయాన్ని మంత్రి చేతుల మీదుగా అందించారు. అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి పరిటాల రవీంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధర్మవరం రెవెన్యూ డివిజన్ ఏపీయూడబ్ల్యూజే సంఘానికి రూ.1 లక్ష రూపాయల విరాళాన్ని నాయకులు పరిటాల శ్రీరామ్ ప్రకటించారు. అనంతరం పలువురు సీనియర్ పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!