
వెయ్యి కోట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం :అమిత్ షా
Delhi (డిల్లీ) : హోం మంత్రి అమిత్ షా చెరకుతో పాటు మొక్కజొన్న, విరిగిన బియ్యం, వృధా చేసిన పండ్లు , వెదురు వంటి వనరులను ఉపయోగించి ఇథనాల్ ఉత్పత్తికి బహుళ-డైమెన్షనల్, భవిశ్యత్తు విధానాన్ని అవలంబించాలని కేంద్ర సహకారం మరియు హోం మంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌సిఎస్‌ఎఫ్) కార్యక్రమంలో షా మాట్లాడరు. ఇథనాల్ ఉత్పత్తి లాభదాయకమైన, ఆచరణీయమైన వ్యాపారమని, రెండేళ్లలో దేశానికి 1,000 కోట్ల లీటర్లు అవసరమవుతాయని తెలిపారు.
పెట్రోలులో ఇథనాల్‌ను జీవ ఇంధనంగా కలిపే పరిమితిని ప్రభుత్వం పెంచుతున్నదని ఆయన వెల్లడించారు. 2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ లక్ష్యాన్ని చాలా ముందుగానే సాధించవచ్చని షా చెప్పారు. ఇథనాల్ బ్లెండింగ్ శాతాన్ని 26 శాతానికి పెంచుతామని కూడా ఆయన పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చొరవ కారణంగా గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ ఏర్పడిందని, ఇది ఇథనాల్ ఎగుమతులకు అవకాశాలను సృష్టిస్తుందన్నారు.దీనివల్ల రైతులకు మేలు చేస్తుందని షా తెలిపారు. భవిష్యత్తులో ఎగుమతి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని దేశం తన ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు సిద్ధంగా ఉండాలని షా ఉద్ఘాటించారు.