ఎన్నికలను సజావుగా ప్రశాంత వాతావరణంలో  నిర్వహిస్తాం

ఎన్నికలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తాం

  జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్
పుట్టపర్తి, న్యూస్ వెలుగు: జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు పటిష్టంగా ఎన్నికలను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్   రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు కు వివరించారు మంగళవారం విజయవాడ నుండి రాష్ట్రంలోని పెద్ద, మధ్య, చిన్న తరహా నీటి పారుదల క్రింద ఉన్న సాగు నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ పై జిల్లా జిల్లా కలెక్టర్ల తో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామా నాయుడు వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక కలెక్టరేట్ లోని
కోర్టు హాలులో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండిజిల్లా కలెక్టర్, టీఎస్ చేతన్ ,జాయింట్ కలెక్టర్, అభిషేక్ కుమార్ డిఆర్వో కొండయ్య, జలవనరుల శాఖ అధికారులు దేశనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ జిల్లాలో పెద్ద, మధ్య, చిన్న తరహా నీటి సంఘాలు ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణం లో, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అందుకు సంబంధిత అధికారులు పకడ్బందీ గా కార్యాచరణ ను తయారు చేసి నివేదించాలని ఆదేశించారు. ప్రస్తుతంజిల్లా పరిధి లో 230 పెద్ద, మధ్య, చిన్న తరహా నీటి సంఘాలు ఉన్నాయని అన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వరదని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ… రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని… నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. అక్టోబర్ 16 నుంచి నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికల ప్రక్రియ మొదలు అవుతుందని, ఇందుకు సంబంధించిన షెడ్యూలు, నామినేషన్ పత్రాలను కలెక్టరేట్లకు పంపడం జరుగుతుందన్నారు. షెడ్యూల్ విడుదల చేసిన పిదప రోజు వారి కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలన్నారు. నీటి వినియోగదారుల సంఘానికి 6 మంది ప్రాదేశిక సభ్యులను6 ఎన్నుకోవాలని, వారి నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎంపిక చేసుకోవాలన్నారు. నీటి సంఘానికి అధ్యక్షున్ని ఎగువ ప్రాంతాల నుండి ఎన్నుకోబడినట్లయితే, ఉపాధ్యక్షుడు దిగువ ప్రాంతాల నుండి మరియు వైస్-వెర్సా నుండి తప్పక ఎంపిక చేయబడాలని మంత్రి పేర్కొన్నారు. అనంతరం వివిధ అంశాలపై తగుసూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో మహేష్, పెనుగొండ ఆర్డిఓ ఆనంద్, కదిరి ఆర్డీవో శర్మ, జల వనరుల శాఖ అధికారులు గంగాధర్ డి ఈ, గంగాద్రి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!