తప్పు ఎవరు చేసిన సహించం : మంత్రి నరలోకేష్
న్యూస్ వెలుగు వెలగపూడి:
అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురంలో మహిళను చెట్టుకు కట్టేసి అమానవీయంగా వ్యవహరించిన ఘటన నన్ను ఆవేదనకు గురిచేసిందని మంత్రి నరలోకేష్ ట్విట్టర్ వేదికగా అన్నారు. ఇటువంటి చర్యలనుకూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు . ఈ ఘటనకు బాధ్యులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు మంత్రి నరలోకేష్ తెలిపారు. మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు . ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మంత్రి నరలోకేష్శి వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!