సంక్షోభంలోనూ సంక్షేమం…ఇది మంచి ప్రభుత్వం

సంక్షోభంలోనూ సంక్షేమం…ఇది మంచి ప్రభుత్వం

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,టీడీపి ఇంచార్జీ వీరభద్ర గౌడ్ ఆదేశాల మేరకు హెబ్బటం గ్రామంలో సర్పంచ్ కృష్ణవేణి,ప్రత్యేక అధికారి శ్రీనివాసులు,పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ మరియు అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ ఇది మంచి ప్రభుత్వం స్టికర్లను అతికించారు.ముఖ్యంగా రైతులకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,వృద్ధాప్య పెన్షన్,మెగా డీఎస్సీ,అన్న క్యాంటీన్ ద్వార ఐదు రూపాయలకు భోజనం అందించే పథకాలను ప్రారంభించారని ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ఈరన్న,పకీరప్ప,లక్ష్మయ్య,వన్నూరప్ప,నరసప్ప,శ్రీనివాసులు,లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!