మార్క్ ఫెడ్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం : సీపీఐ

మార్క్ ఫెడ్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం : సీపీఐ

నంద్యాల : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే మార్క్ ఫెడ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామనీ  సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ప్రభుత్వాన్ని  హెచ్చరించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం లో అత్యధికంగా మొక్కజొన్న పంటను రైతులు సాగు చేసారని వేలాది హెక్టార్లలో సాగుచేసిన పంట వర్షం దాటికి తట్టుకొని అరకొర చేతికి వచ్చింన దిగుబడిని  మద్దతు ధర లేకపోవడం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రైతులను మోసం చేస్తున్నారని వారు అన్నారు.  రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటా 3,500 ధర కల్పించలని లేని పక్షంలో మార్క్ ఫెడ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు హెచ్చరించారు. శనివారం పాములపాడు మండలం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య జిల్లా నాయకులు రమేష్ బాబులతో కలిసి రైతుల మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!