పార్టీ నాయకులకు అండగా ఉంటా..
*హోళగుంద మండలం అంటే నాకు గుండే లాంటిది
*త్రాగునీరు,రహదారి సమస్యల పరిష్కారానికి పోరాడుతా.
*నాయకులు ఎవరు అధైర్య పడొద్దు.
*ఎమ్మెల్యే బూసినే వీరుపాక్షి.
హోళగుంద,న్యూస్ వెలుగు: పార్టీ నాయకులు ఎవరు కూడా అధైర్య పడొద్దని ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని ఆలూరు ఎమ్మెల్యే బూసినే వీరుపాక్షి సూచించారు.శనివారం మండల కేంద్రంలో పార్టీ నాయకులు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి ఘన స్వాగతం పలికారు.అనంతరం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తదనంతరం పార్టీ నాయకులు,కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరికి బెదరకుండా పార్టీ నాయకులు ధైర్య ఉండాలని,ప్రభుత్వ కార్యాలయాల్లో తమ సమస్యలు పరిష్కారం కాకపోతే అధికారులను ప్రశ్నించాలని సూచించారు.కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న సూపర్ సిక్స్ పథకాల మాత్రం అమలు కాలేదన్నారు.
హోళగుంద-ధనాపురం వరకు అధ్వాన్నంగా ఉన్న రహదారి సమస్యను ఉపముఖ్యమంత్రి రహదారి నిర్మాణ శాఖ మంత్రి దృష్టి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.అలాగే హోళగుంద మండలం అంటే నాకు ఒక గుండె లాంటిదన్నారు.ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తెస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.అంతేకాకుండా ఎన్నికల ముందు హోళగుంద మండల ప్రజలు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పిన మాట ప్రకారం తనకు తమ అమూల్యమైన ఓటు గెలిపించిన మండల ప్రజలందరికీ అభివాదాలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గట్టిగా ఉండాలి,అధికారంలో ఉన్నప్పుడు మెత్తగా ఉండాలని తెలియజేశారు.ఎంత గట్టిగా ఉంటే అంత ఉన్నత స్థాయికి ఎదుగుతాన్నారు.
అదేవిధంగా సెపక్టక్రా క్రీడా పోటీకి భారత జట్టుకు ఎంపికైన మధు మరియు తండ్రి బసవరాజులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో బళ్ళారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ,మండల కన్వీనర్ షఫీయుల్లా,కో కన్వీనర్ రవి,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప,ఎంపిటిసి మల్లికార్జున,మంజు,రమేష్,సర్పంచ్ తనయుడు పంపాపతి,వైస్ ఎంపిపి భర్త హనుమప్ప,మాజీ సొసైటి చైర్మన్ మల్లికార్జున,కోగిలతోట సర్పంచ్ తనయుడు నాగప్ప నాయుడు,సర్పంచ్ వెంకట్ రెడ్డి,వెంకట్ రామి రెడ్డి,దర్గప్ప,వీరుపాక్షి రెడ్డి,నాగి రెడ్డి,వైసిపి నాయకులు సోమిరెడ్డి,రామకృష్ణ,మోహన్ రాజ్,కాకి పక్కిరప్ప,కృష్ణయ్య,పాల్తూర్ గోవింద,వెంకటేష్,నాగప్ప,గోవింద,రహంతుల్లా,గిరి,సిద్దప్ప, రాఘేంద్ర,మల్లికార్జున రెడ్డి,రంగ స్వామి,నందిష్, మౌనిష్,ఇమామ్ హుస్సేన్, నాగప్ప,భాష,లక్ష్మీకాంత్ రెడ్డి,బసవన్న గౌడ,షేక్షవలి శంభు లింగ జడప తదితరులు పాల్గొన్నారు.