
మార్కెట్ యార్డ్ లో మహిళా దినోత్సవ0
కర్నూలు న్యూస్ వెలుగు; కర్నూలు మార్కెట్ యార్డు నందు మహిళా దినోత్సవం నిర్వహించడమైనది. మహిళా దినోత్సవం పురస్కరించుకొని యార్డు నందు పనిచేయుచున్న మహిళా కార్మికులకు ఆటాల పోటీలు నిర్వహించి గెలిచిన మహిళా కార్మికులకు బహుమతులు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమం నందు కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతు మహిళలు ప్రతి రంగం లో ముందు ఉండాలి అని యార్డు నందు మహిళా కార్మికులకు యే సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేసారు. ఈ కార్యక్రమం నందు కార్యదర్శి జయలక్ష్మి పాటూ సీపీఎం నాయకులు నీ ర్మలమ్మ, రాముడు, హమాలీలు , కార్యాలపు సిబ్బంది పాలుగొన్నారు. అనంతరం మహిళ కార్మికులకు బోజన సదుపాయం కల్పించడం జరిగినది.
Was this helpful?
Thanks for your feedback!