
యువత అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి : ఎంపీటీసీ మునెప్ప
పత్తికొండ న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మారెళ్ళ గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగాసర్పంచ్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ , ఎస్టీ, బడుగు , బలహీల వర్గాల ఆశాకిరణం ఆయనేనన్నారు. ఆయన ఆశయ సిద్ధాంతాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సుధాకర్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. విద్యనే బలమైన ఆయుధమని అంబేద్కర్ చదువుకోవడం వల్లే విదేశాల్లో చదువగలిగారని ముక్కెళ్ల ఎంపిటిసి మునెప్ప అన్నారు. ఈ కార్యక్రమంలో మధుశేఖర్ , మహేష్ , రంగస్వామి ,గళ్ళ పెద్దయ్య , రామకొండ రమేష్ , మంకె రాముడు , బత్తిన రమేష్, అగ్రహారం ఆంజనేయులు గ్రామా పెద్దలు యువత పాల్గొన్నారు.