
ఆలా డేవిడ్ వార్నర్ సినిమాలోకి వచ్చారు ?
న్యూస్ వెలుగు సినిమా రీల్స్ : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా ‘రాబిన్హుడ్’ లో అతిథి పాత్రలో నటించడం వెనుక ప్రధాన కారణాలు వార్నర్ కు తెలుగు వారిపై ఉన్న అభిమానమేనని విశ్లేషకులు తెలిపారు. వార్నర్ వెండితెరపై కనిపించడం అభిమానులను సంతోషంలో ముంచేసిందనే చెప్పొచ్చు ఇలా వార్నర్ తెలుగు ఇండస్ట్రీవర్గాల్లో ఓ చర్చ మారారు. వార్నర్ తెలుగు సినిమాలపై ప్రత్యేకమైన ఆసక్తి కలిగి ఉన్నారు. గతంలో అల్లు అర్జున్ పాటలకు డ్యాన్స్ చేస్తూ, సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసి, తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సినీ విశ్లేషకులు తెలిపారు.
దర్శకుడి ఆహ్వానంతో ‘రాబిన్హుడ్’ దర్శకుడు వెంకీ కుడుముల , సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం అంతర్జాతీయ గుర్తింపు ఉన్న వ్యక్తిని తీసుకోవాలని భావించారు. ఈ సందర్భంలో డేవిడ్ వార్నర్ పేరు సూచించగా, నిర్మాతలు వారిని సంప్రదించి, ఆ పాత్ర కోసం ఆహ్వానించారు.
భారతీయ అభిమానులతో అనుబంధం, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడిన అనుభవం ద్వారా, వార్నర్ భారతీయ అభిమానులతో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నారు. ఈ అనుబంధం, ఆయనను తెలుగు సినిమాలో నటించడానికి ప్రేరేపించిందని సినీరంగంలో చర్చించుకున్నారు . డేవిడ్ వార్నర్ ‘రాబిన్హుడ్’ సినిమాలో నటించడం నిర్ణయించుకున్నారు, ఇది తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తోందని సినిమా చుసిన అభిమానులు చెప్పుకొచ్చారు.