శ్రీ సత్యసాయి జిల్లా :

జిల్లాలో మర్చి 17 నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 104 పరీక్షాకేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. మర్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షా కేంద్రాల వద్ద 144 అమలులో ఉంటుందని వారు వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆకతాయిలను జిల్లా ఎస్పీ రత్న హెచ్చరించారు. జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేడయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు .
Thanks for your feedback!