FlatNews Buy Now
అన్న క్యాంటీన్ భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్

అన్న క్యాంటీన్ భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్

ఎమ్మిగనూరు ( న్యూస్ వెలుగు) :అన్న క్యాంటీన్ లలో ప్రతి రోజు నాణ్యతతో కూడిన భోజనమును ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అన్న క్యాంటీన్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ సమీపములో ఉన్న అన్న క్యాంటీన్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ ల ద్వారా అందచేస్తున్న భోజనం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని కలెక్టర్ తెలిపారు. అక్కడే భోజనం చేస్తున్న ఎమ్మిగనూరు చిన్న కమేలి విధికి చెందిన వలి బాషా, మహబూబ్ బాషా లతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారా? భోజనం రుచిగా ఉంటుందా..?సరిపోయేంత భోజనం పెడుతున్నారా..? క్యాంటీన్ ను శుభ్రంగా ఉంచుతారా?? అనే విషయాలను కలెక్టర్ వారిని ఆరా తీశార. భోజనం రుచిగా పెడుతున్నారని, సరిపోయినంత పెడుతున్నారని, క్యాంటీన్ శుభ్రంగా ఉంచుతున్నారని, ప్రతిరోజు ఇక్కడే భోజనం చేస్తామని చాలా బాగుంటుందని కలెక్టర్ కి తెలిపారు.

అనంతరం కలెక్టర్ నేరుగా భోజనం వండిస్తున్న ప్రదేశం వద్దకి వెళ్ళి అన్నం, పప్పు, సాంబార్, కర్రీ లను పరిశీలిస్తూ అక్కడే ఉన్న అన్న క్యాంటీన్ సిబ్బందితో మాట్లాడుతూ వచ్చిన ప్రజలకు సరిపోయేంత భోజనం పెడుతున్నారా?? మధ్యాహ్నం భోజనం ఏ సమయానికి ఇక్కడికి వస్తుంది?? ప్రతి రోజు ఎంతమంది భోజనం చేస్తున్నారు?? కర్రీ సరిపోతుందా?? సమస్యలు ఏమైనా ఉన్నాయా?? అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నారని ఇదే విధంగా కొనసాగించాలని కలెక్టర్ అన్న క్యాంటీన్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS