
చదువుతో పాటు అన్ని రంగాలలో ప్రోత్సహిస్తాం: కేశవ రెడ్డి
కర్నూలు,( న్యూస్ వెలుగు): విద్యా సంస్థల్లో విద్యార్థులను చదువు తోపాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత ఎన్. కేశవరెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న కేశవరెడ్డి ఉన్నత పాఠశాల మైదానంలో వార్షిక క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామన్నారు. పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ గా అభివృద్ధి చెంది ప్రస్తుత సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుకొని మంచి స్థానంలో ఉన్నారని అన్నారు.అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Was this helpful?
Thanks for your feedback!

