ఆదోనిలో ఘనంగా  ప్రపంచ యువజన దినోత్సవం

ఆదోనిలో ఘనంగా  ప్రపంచ యువజన దినోత్సవం

న్యూస్  వెలుగు , ఆదోని  :    రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలోని పద్మావతి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ నందు ప్రపంచ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి  జి అర్చన  మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని సెల్ఫోన్ వినియోగాన్ని మంచి పనులకు ఉపయోగించాలని ,కష్టపడి చదివి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని తమరి అనుభవాలను విద్యార్థులకు తెలియజేశారు .అలాగే ఈ కోర్స్ అయిన వెంటనే న్యాయ సంబంధమైన కోర్సులు కూడా చేయవచ్చని తెలియజేశారు. అలాగే టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ అన్ని రకాల పరిస్థితులను విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని మెలగాలని మెడికల్ పరంగా న్యాయపరంగా పోలీస్ పరంగా విద్యార్థులకు ఉండే హక్కులను బాధ్యతలను తెలియజేశారు. లోకేష్ కుమార్ సీనియర్ న్యాయవాది న్యాయ సహాయం గురించి  మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ గురించి తెలియజేశారు. అలాగే జూనియర్ న్యాయవాది సుమంగళ విద్యార్థులు మంచి నడవడిక కలిగి ఉండాలని భవిష్యత్తులో తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS